• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఒక్క నమస్కారంతో వేల మందిని ఎన్టీఆర్ ఎలా కంట్రోల్‌ చేసారంటే..!

ఒక్క నమస్కారంతో వేల మందిని ఎన్టీఆర్ ఎలా కంట్రోల్‌ చేసారంటే..!

Published on June 18, 2024 by ajay raj

Advertisement

ఇదివరకు సినిమా షూటింగ్ లు ఎక్కువ శాతం స్టూడియోలోని జరిగేవి. ఇల్లు, గుడి, బడి, ప్యాలెస్, అడవి ఇలా ఏ లొకేషన్ లో తీయాలన్నా దానికి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ చేసే వాళ్ళు. అవుట్డోర్ షూటింగ్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. ఎవరన్నా ధైర్యం చేసి అవుట్డోర్ షూటింగ్ చేయాలని అనుకుంటే వచ్చే జనంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారట. అలాంటి ఓ సంఘటన ఎన్టీఆర్ జమున ఎల్. విజయలక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన రాముడు భీముడు మూవీ టైంలో జరిగింది. మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించిన సినిమా ఇది.

Advertisement

షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఎన్టీఆర్ నాగార్జునసాగర్ వెళ్లాల్సి వచ్చింది అక్కడ షూటింగ్ చేద్దామని రెండు పాటలు బాలన్స్ ఉన్నాయి కదా అని రామానాయుడు చెప్పారట దానికి ఎన్టీఆర్ మీరు చేస్తానంటే మేము కూడా సిద్ధమే అని అన్నారు. సాధారణంగా ఎన్టీఆర్ అందర్నీ బ్రదర్ అని అనేవారు. ఎన్టీఆర్ ని ఎవరైనా బహువచనంతోనే పిలిచే వాళ్ళు కానీ రామానాయుడు ఒక్కరే ఎన్టీఆర్ ని బ్రదర్ అని పిలిచేవారట. నాగార్జునసాగర్ నిర్మాణంలో ఉన్నప్పుడు షూటింగ్ చేయాల్సి వచ్చింది ఏఎన్ఆర్ నటించిన డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని అక్కడ కొంత భాగం తీశారు జనంతో పడలేక తిరిగి వచ్చేసారని రామానాయుడు కి తెలిసింది ఈ పాట అక్కడ తీయాలని ఫిక్స్ అయ్యారు. కనుక అక్కడ పోలీసులు కాంటాక్ట్ చేశారు రామానాయుడు అలా జనాన్ని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని తాము వేరే పని మీద ఉన్నామని రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేయమని పోలీసులు చెప్పారు.

Advertisement

Also read:

  •  Harom Hara Review: హరోంహర సినిమా హిట్టా..?, ఫట్టా..?

ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కి చెప్పారు మరేం పర్వాలేదు బ్రదర్ అని మనం చూసుకుందాం పదండి అని బయలుదేరారట. నాగార్జునసాగర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలను నిర్మాత రామ నాయుడు ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ.. షూటింగ్ మొదలు పెట్టే సమయానికి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారని అందరికీ నమస్కారం చేసి చుట్టూ కవర్ చేసామని మీరు వెనక్కి జరిగి మాకు సహకరిస్తే మా పని చేసుకుంటామని ఎంతో వినయంగా రామారావు జనానికి ఉద్దేశించి అనగానే.. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారట. అక్కడికి వచ్చిన జనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సహకరించారు అలా రెండు రోజులు పోలీసులు సహాయం లేకుండా రామారావు మాటతో పాటను పూర్తి చేయగలిగారని రామానాయుడు చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ? Mansion 24 webseries : మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే ? Bhgavanth Kesari Child Artist: “భగవంత్ కేసరి” సినిమాలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? vijayashanthiActress Vijayashanthi “విజయశాంతి” పేరులో ఉన్న ఈ మిస్టరీ గురించి తెలుసా? ఈ పేరులో “విజయ” అంటే ఎవరంటే?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd