Advertisement
ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకి అవకాశం వచ్చింది. పాయకరావుపేట నుండి మొదటిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వంగలపూడి అనిత. రెండవసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయ్యారు. ఈరోజు ఏకంగా హోం శాఖను సొంతం చేసుకున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన శాఖను ఆమె దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి రికార్డ్ మెజారిటీతో గెలిచి హోంశాఖను దక్కించుకున్నారు అనిత.
Advertisement
సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ఇప్పుడు హోం శాఖను దక్కించుకున్నారు. ఆమె ఉపాధ్యాయులుగా పని చేయడం, ప్రతి విషయం పైన సమగ్రమైన అవగాహన ఉండడం అలాగే వాగ్దాటి, సూటిగా మాట్లాడటంలో ఆమె దిట్ట. ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తారు. ఇది చూసి అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతల్ని అప్పగించింది. మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు.
Also read:
Advertisement
Also read:
ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అనితకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన పదవికి ఆమె న్యాయం చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు. ఎస్సీ మహిళగా ఉన్న అనిత మీద వైసిపి ప్రభుత్వం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు గట్టిగా పోరాడారు. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు రెండోసారి పాయకరావుపేట నుండి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా చంద్రబాబు మాత్రం ఆమె సేవలను గుర్తించారు క్యాబినెట్లోకి తీసుకున్నారు. మంత్రి పదవి ప్రకటించారు ఇప్పుడు ఏకంగా హోం శాఖను ఇచ్చారు .వైసీపీ ప్రభుత్వంలో సైతం మొదట ఎస్సీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోం మంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో భాగంగా తానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు అనితకు ఛాన్స్ వచ్చింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!