Advertisement
ఆలయానికి వెళ్తే ఏదో తెలియని ప్రశాంతత మనలో కలుగుతుంది. సమస్యలన్నీ తొలగిపోయినట్లు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సరిగ్గా గంట కొట్టకపోవడం. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది గంట కొడతారు. కానీ ఆ పద్ధతి తప్పు. హిందూమతంలో గుడిలో చేసే పూజలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆలయంలో ప్రార్థనలు చేయడం వలన ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అయితే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. కొందరికి ఈ నియమాలు తెలియకపోవచ్చు.
Advertisement
గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసిన తర్వాత గంట కొడుతుంటారు కొందరు భక్తులు ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా గంటను మోగిస్తారు. కానీ దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టకూడదు. శబ్దం శక్తితో ముడిపడి ఉంటుంది. శబ్దం ద్వారా శక్తిని ప్రసారం చేయడానికి అవుతుంది. ఆలయంలో గంట మోగిస్తే ఆ శబ్దం ద్వారా సానుకూల శక్తి మనకు మన చుట్టూ ఉండే వాళ్లకు చేరుతుంది. వాస్తు శాస్త్రం స్కంద పురాణంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. గంట మోగించినప్పుడు వెలువడే శబ్దం ఓం శబ్దానికి సమానమని అంటారు ఓం శబ్దం చాలా పవిత్రమైనది పాజిటివ్ ఎనర్జీతో ముడిపడి ఉంటుంది గుడి గంట మోగిస్తే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంతోషం సంపద కలుగుతాయి. దేవుడు గంట శబ్దాన్ని ఇష్టపడతాడని దీనిని కొట్టడం వలన భక్తులు దేవతలు దృష్టిని తమ వైపుకు తిప్పుకోవచ్చు అని అంటుంటారు.
Advertisement
ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టడం వలన ఆలయంలో పాజిటివ్ ఎనర్జీని మన వెనకే వదిలేసి వస్తున్నట్లు అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆలయంలోనే ఉండిపోతుంది. మనం వట్టి చేతులతో బయటకు రావాల్సి ఉంటుంది. గుడి లోపలికి అడుగు పెట్టాక గంట మోగిస్తే మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గంట శబ్దం దేవునికి స్వాగతం పలుకుతుంది. ఆలయానికి వెళ్ళగానే గంట కొట్టడం మంచిది గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అందుకే గంట కొట్టకండి పైగా ఆలయంలోకి వెళ్లగానే గంట కొట్టడం ద్వారా దేవునికి స్వాగతం పలికినట్లు అవుతుంది. గంట శబ్దం కారణంగా మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!