Advertisement
సితార ఘట్టమనేని రాబోయే తరానికి కాబోయే స్టార్ హీరోయిన్ అని ఎంతగానో అభిమానులు సరదా పడుతున్నారు. కానీ ఆమె సినిమాల్లోకి రాదట. మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేదు. కొడుకు గౌతమ్ కంటే స్టార్ స్టేటస్ ని సితార దక్కించుకుంది ఆమె పోస్టులు పెట్టడం డాన్స్లు వేయడం ఫోటోషూట్ లు ఇలా అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. పదేళ్లకే ఈ చిన్నది ఇంటర్నేషనల్ జువెలరీ యాడ్లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆమె డొనేట్ చేసింది. 11 ఏళ్లకే సితార హీరోయిన్లను మించిన అందంతో షాక్ ఇస్తుంది. ఒకపక్క డాన్స్ కూడా నేర్చుకుంటోంది. ఇంకో పక్క చదువుతోంది.
Advertisement
తండ్రి మహేష్ తో షోస్ కి అలాగే ఇంటర్వ్యూలకి వస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల బాటలోనే హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటున్నట్లు సితార ఎప్పుడో చెప్పింది అయితే ఈమె డెబ్యూ ని హాలీవుడ్ లో ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె తన మనసులో మాట చెప్పింది చిన్నప్పటి నుండి నాన్నని చూసి పెరగడం వలన సినిమాలు అంటే ఇష్టమని ఇంగ్లీష్ సినిమాల్లోనే నటించాలనుకుంటున్నానని ఆమె చెప్పింది టాలీవుడ్ బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
Advertisement
Also read:
Also read:
తన కెరీర్ మీద ఒక క్లారిటీతో ఉందని తెలుస్తోంది హాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు. ఈ మధ్యనే అవంతిక అని తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సితార హాలీవుడ్ వైపు దృష్టి పెట్టడంతో టాలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కాని కనపడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే చూడండి!