Advertisement
వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, అన్నీ, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు ఈ సినిమాలో నటించారు. రాజేష్ జగన్నాధం ఏ దర్శకత్వం వహించారు. నిర్మాతగా వ్యవహరించారు. సంతు ఓంకార్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు. ఇక మూవీ కథ, రివ్యూ చూసేద్దాం.
Advertisement
సినిమా: నింద
నటీ నటులు: వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, అన్నీ, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు
దర్శకుడు: రాజేష్ జగన్నాధం
నిర్మాత: రాజేష్ జగన్నాధం
సంగీతం: సంతు ఓంకార్
రిలీజ్ డేట్: 21-06-2024
కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వచ్చేస్తే ఒక ఊరిలో అమ్మాయి రే*ప్ కి గురై చనిపోతుంది. అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది ఈ క్రమంలో పోలీసులు ఆ అమ్మాయిని ఒకరు చంపితే ఇంకొకరిని జైలుకు పంపిస్తారు. మరి అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది..? ఆ అమ్మాయిని చంపిన అసలు నేరస్థులు ఎవరు..? వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. దర్శకుడు రాజేష్ జగన్నాథం ఎంచుకున్న పాయింట్ బాగుంది అయినాప్పటికీ ఈ సినిమాని మొదట నుండి కూడా తను ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తనకి ఇది మొదటి సినిమా కావడం వలన అక్కడక్కడా కొద్దిగా తడబడ్డాడు అనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు.
Advertisement
అందులో భాగంగా ఈ సినిమాలో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. కొన్ని ట్విస్టులు కూడా సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎవరు మర్డర్ చేసారు అనే ఒక అంశం మీద సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లి చివర్లో రివిల్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం బాగుంది, ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే సినిమాని ముందుకు తీసుకువెళ్లడంలో చాలా దాకా హెల్ప్ చేసింది. ఎప్పుడైతే వరుణ్ సందేశం ఎంట్రీ ఉంటుందో అప్పటినుండి సినిమా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది అక్కడక్కడ సినిమా పరంగా కథ పరంగా కొంచెం తగ్గినట్లు అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు.
Also read:
నటలు కూడా బానే వాళ్ళ పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు. ఛత్రపతి శేఖర్ చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషించారు వరుణ్ సందేశ్ కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇక టెక్నికల్ అంశాలు విషయానికి వచ్చేస్తే సంతు ఓంకార్ కొంచెం మంచి మ్యూజిక్ ఇస్తే బాగుండేది అనిపించింది. అలానే సస్పెన్స్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేయడానికి అయినా మ్యూజిక్ అనేది కొంత వరకు డల్ అయింది అని చెప్పొచ్చు. కొన్ని సీన్లలో అవసరం లేకపోయినా కూడా కొంత మరీ ఎక్కువ ఎడిటింగ్ ఇచ్చారు అది కాస్త ఇంప్రూవ్ చేసుకుని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
వరుణ్ సందేశ్ నటన
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
సాధారణ కథ
మ్యూజిక్
Rating: 2.25/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!