Advertisement
భార్యాభర్తల మధ్య అనేక గొడవలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని సర్దుకుంటూ వెళ్ళిపోతేనే జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి అనేక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. దంపతులు మధ్య వయసులో తేడా సంబంధాలను ప్రభావితం చేస్తుందా అనేది చాలామందికి ఉండే ప్రశ్న ఏజ్ గ్యాప్. పెళ్లి చేసుకున్న వారిని అడిగితే కొందరు ప్లస్ అని అంటే కొందరు మైనస్ అంటూ ఉంటారు. ఐదేళ్లకు మించి గ్యాప్ వస్తే కొంత అభిప్రాయ బేధాలు వస్తాయి అని చాలామంది దంపతులు సాధారణంగా చెప్పే అభిప్రాయం జంటల మధ్య వయసు వ్యత్యాసం. ఎక్కువగా ఉంటే సాధారణంగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి. మన స్నేహితులు గ్రూప్ ని పరిశీలించి చూస్తే మనకంటే కొంచెం పెద్ద వాళ్లతో మనం ఎక్కువగా తిరగలేము. కంఫర్ట్ గా ఉండలేము. వయసు సేమ్ అయితే కొంచెం వాళ్ళతో కలిసి తిరగడానికి ఇష్టపడుతూ ఉంటాం.
Advertisement
Advertisement
పెద్దవాళ్ళు కాబట్టి మన మధ్య ఒక హద్దు ఉంటుంది రిలేషన్షిప్ లో కూడా అంతే. ఒకే ఆలోచనలు ఒక విషయాన్ని తీసుకునే విధానం భిన్నంగా ఉంటాయి. దంపతులు మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఒక వ్యక్తికి చాలా ఉత్తేజకరమైనది మరొకరికి కాదు. ఈ వ్యత్యాసం సంబంధాలతో కూడా సమస్యలు కలిగిస్తుంది. మనకు 17 ఏళ్ల వయసులో ఉండే ఆలోచన 24 ఏళ్ల వయసులో ఉండదు. అనుభవాలు పరిపక్వత ఆలోచనలు మారుతాయి. 18 ఏళ్ళ వయసులో మన ఆలోచన తప్పు కాదు. అది అప్పుడు సరైనదే. ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అది సరైనది కాదు అనిపించొచ్చు. ఇప్పుడు మన నిర్ణయాలు అప్పుడు తీసుకున్నట్లు ఉండవు. కాబట్టి వయసు పెరిగే కొద్ది మార్పు వస్తూ ఉంటుంది వయసులో తేడా అధికంగా ఉంటే సామాజిక వ్యత్యాసం ఉంటుంది ఆలోచనలు భిన్నంగా ఉంటాయి వారు పెరిగిన వాతావరణం వారు నేర్చుకున్న సంస్కృతి కూడా ప్రభావం చూపిస్తాయి. మనం పెరిగిన వాతావరణం మనం మన వ్యక్తిత్వం చాలా ప్రభావం చూపిస్తుంది.
Also read:
జీవిత భాగస్వామికి స్వేచ్ఛని ఇవ్వకపోతే కట్టేస్తున్నారు అన్న ఆలోచన మొదలవుతుంది. ఇష్టం వచ్చినట్లు ఏమి చేయనివ్వట్లేదు అనే భావన కలుగుతుంది. అలాగే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అధికారాన్ని ప్రయోగిస్తారు. భాగస్వామీ 10, 15 ఏళ్లు పెద్దగా ఉంటే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. 30 దాటాక డయాబెటిస్ కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. అయితే ఏజ్ క్యాప్ ఎంతుందో అంతకు మించిన ప్రేమతో ఉన్న బాగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!