Advertisement
ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ అందరికీ సుపరిచితమే. ఉదయ్ కిరణ్ పలు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని రోజులకి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మూవీ తో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో ఉదయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆ ఏడాది హైయెస్ట్ గ్రాస్ లో ఒకటిగా నిలిచింది తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే ఇలా పలు సినిమాలో నటించారు.
Advertisement
అగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలకు మించి ఉదయ్ మూవీస్ ఓపెనింగ్స్ వసూళ్లను రాబట్టేవి. ఇలా కొన్ని సినిమాలతో వరుసహిట్లను అందుకున్న ఉదయ్ కిరణ్ తర్వాత సినిమాలతో సక్సెస్ ని అందుకోలేకపోయారు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ దశలో పెళ్లి చేసుకున్న ఆయన వైవాహిక జీవితంలోను ఒడిదుడుకుని ఎదుర్కోవాల్సి వచ్చింది. కెరియర్ సక్సెస్ అయ్యాక వ్యక్తిగత జీవితంలో సమస్యలతో మానసికంగా బలహీనమైపోయి అర్దాంతరంగా జీవితాన్ని చాలించారు. 2014 జనవరి 5 హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్లో ఆ$త్మహ$త్య చేసుకున్నారు చనిపోయినటికీ ఉదయ వయసు కేవలం 33 ఏళ్లు మాత్రమే.
Advertisement
Also read:
అతని మరణ వార్తతో చిత్ర పరిశ్రమ షాక్ అయిపోయింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా జైశ్రీరామ్ అని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ. మోహన్ దర్శకత్వం వహించారు. ఉదయ్ కిరణ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసే మున్నా అనే వ్యక్తి సినిమాకు నిర్మాత ఉదయ బతికున్నప్పుడే సినిమా షూటింగ్ పూర్తి చేయగా ఆయన మరణించిన రెండు నెలలకు ట్రైలర్ వచ్చింది అయితే పలు కారణాల వలన దాదాపు పదెండ్లుగా చిత్రం చెప్పిన కథ విడుదల కాలేదు. అయితే మూడేళ్లుగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మున్నా ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి కార్యరూపం దాల్చి ఈ చిత్రం చెప్పిన కథ విడుదల కావాలని అభిమనూలు సన్నిహితులు కోరుకుంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!