Advertisement
అందరూ కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత గానోఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేసింది. ప్రభాస్ నటించిన మెగా బడ్జెట్ కల్కి సినిమా విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా వేదాలలో పేర్కొన్న కల్కి పురాణం నుండి ఈ పేరు వచ్చింది. ఈ చిత్రం చాలా మందికి నచ్చింది. పురాణాల ప్రకారం హిందూమతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల్లో ఒకరు మహావిష్ణు. ఈ ముగ్గురు త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్త మహేశ్వరుడు అంటే శివుడు విధ్వంసకుడిగా పిలవబడ్డాడు.
Advertisement
విష్ణు మొత్తం విశ్వానికి సంరక్షకుడుగా పురాణాల్లో పేర్కొన్నారు. హిందువుల ప్రకారం మంచి చెడుల మధ్య సమతుల్యతను పునరుద్దించడానికి విష్ణువు చాలాసార్లు మానవుడు రూపంలో భూమి మీదకి వచ్చాడు. కల్కి విష్ణువు యొక్క చివరి అవతారంగా చెప్పబడింది. అయితే విష్ణువు యొక్క కల్తీ అవతారం ఈ భూమండలానికి అధిపతి అని నమ్ముతారు. హిందూ మతంలో కల్కి ఒక చేతిలో కత్తితో గుర్రపు స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. కల్కి భగవానుని ఈ రూపంలో శ్రీమద్భాగంలో కనబడుతుంది.
Advertisement
Also read:
ఆయన వాహనం వాహనం తెల్ల గుర్రం అని నమ్ముతారు ఈ గుర్రాన్ని దేవ దత్త అంటారు. భగవంతుడి గుర్రంపై స్వారీ చేస్తూ లోకం నుండి పాపుల్ని నాశనం చేసి మతాన్ని పునస్తాపిస్తాడు. దుష్టశక్తులను నాశనం చేయడానికి కల్కి యుద్ధాలు చేస్తాడు. అతని కలియుగ లక్షణమైన గోకా మరియు విగోకా వంటి భయంకరమైన రాక్షసుల్ని ఎదుర్కొని ఓడిస్తాడు. విష్ణు యొక్క ఆరవ అవతారం పరశురాముల నుండి ఆధ్యాత్మికత మరియు యుద్ధం రెండిట్లోనూ కల్కి తీవ్రమైన బోధనను పొందాల్సి ఉంది. 64 కళారూపాల్లో నిపుణుడు అవుతాడు మరియు వేదాలను ఎలా చదవాలని నేర్చుకుంటాడు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!