Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్కి పేరు మారుమ్రోగిపోతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకి వచ్చే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది తొలి రోజే 190 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది అందరూ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. కమల్ హాసన్, దీపిక, అమితాబ్ తో పాటుగా విజయ్ దేవరకొండ, దిశా పటాని, రాజమౌళి, ఆర్జీవి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కూడా చిన్నచిన్న కామియోలు చేశారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా దూసుకెళ్లిపోతోంది.
Advertisement
కల్కి సినిమా లో అశ్వద్ధామగా అమితాబ్ ఒక గుడిలో తలదాచుకున్నారు కొన్ని వందలుగా గుడిలోనే ఆయన ఉంటారు కల్కి పుట్టుకకు సమయం ఆసన్నమైనప్పుడు గుడి నుండి బయటకు వస్తారు. అయితే అన్ని వందల ఏళ్ళు అశ్వద్ధామకు ఆశ్రయం ఇచ్చినట్లు చూపించిన ఆ గుడి నిజానికి నెల్లూరులో ఉంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమళ్ళపాడు లోని నాగేశ్వర స్వామి ఆలయం కల్కిలో అశ్వత్థామ తలదాచుకున్న ఆలయంగా చూపించారు.
Advertisement
Also read:
Also read:
సినిమాలో ఆలయం కాశీలో ఉన్నట్లు చూపించారు కానీ నిజానికి నెల్లూరులో ఉంది పెన్నా నది తీరంలో దశాబ్దాల పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ ఆలయం 2020లో ఇసుక తవ్వకాల్లో బయటకు వచ్చింది. సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామలాగే పరశురాముడు కూడా చిరంజీవే. ఆలయాన్ని ఆయన నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!