Advertisement
దర్శకుడు నాగేశ్వన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఆయన అందరికీ సుపరిచితమే. ఆయన డైరెక్ట్ చేసిన కల్కి సినిమా వండర్ ని క్రియేట్ చేసింది ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ ని నాగ్ అశ్విన్ తీసుకువెళుతున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి జయంతికి పుట్టారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో టాప్ 10 ర్యాంక్ లో ఉండే నాగ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్ అవుతారని అనుకుంటే మణిపాల్ మల్టీ మీడియా కోర్స్ లో చేరారు.
Advertisement
అక్కడ వీడియో ఎడిటింగ్ తో పాటుగా సినిమాకు అవసరమైన నాలెడ్జ్ ని సంపాదించుకున్నారు తల్లిదండ్రులు శేఖర్ కమ్ముల దగ్గరికి ఆయన్ను పంపించారు. గోదావరి సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు తర్వాత ప్రాజెక్టులు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకుంటారని శేఖర్ కమ్ముల మాట ఇచ్చారు ఈ గ్యాప్ లో మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అందుకు రెమ్యూనిరేషన్ గా నాలుగు వేలు తీసుకున్నారట. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకు కూడా నాగ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. శేఖర్ కమ్ముల నుండి నేర్చుకున్న పాఠాలతో ఓ ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు.
Advertisement
Also read:
ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత. కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ కోసం ఈ మూవీని ఎంపిక చేశారు. దీంతో ఆయన జీవితం టర్న్ అయింది. బాలు సినిమాను మొట్ట మొదట ప్రియాంక నిర్మించారు. ప్రియాంక కొన్ని యాడ్స్ కూడా నిర్మించారు ఆ సమయంలో ఆమెకు నాగ్ అశ్విన్ పరిచయం అయ్యారు నెమ్మదిగా వీళ్ళ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. ఆమెకు ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న టైం లో ‘ఎవరైనా నచ్చితే సరే లేదంటే మనం పెళ్లి చేసుకుందామని’ ఆయన ఆమెకి చెప్పారట. ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పారు వాళ్ళ పెళ్లి 2015లో జరిగింది. స్నేహితులైన అశ్విన్ ప్రియాంక ఆ వివాహ బంధంతో ఒకటయ్యారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!