Advertisement
నటి జెనీలియా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి తెలుగు హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఆమె ఎదిగింది. బొమ్మరిల్లులో హాసినిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. జెనీలియా అనే పేరు చెప్పగానే ముందుగా మనకి బొమ్మరిల్లులు ఆమె నటన గుర్తొస్తుంది అంతలా ఆమె నటన ప్రేక్షకులపై ముద్రవేసింది. శశిరేఖ పరిణయం, ఆరెంజ్ వంటి డిజాస్టర్లు వచ్చాక టాలీవుడ్ కి ఆమె దూరం అయిపోయింది.
Advertisement
బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పలు సినిమాలు చేసింది. నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో పెళ్లి జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈమె సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జెనీలియా నటించిన నాలుగు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉందని చాలామంది అంటున్నారు. ఆ నాలుగు సినిమాలు ఢీ, రెడీ, శశిరేఖ పరిణయం, నా ఇష్టం. వీటిలో కామన్ పాయింట్ ఏంటంటే..? ముందుగా ఢీ సినిమా గురించి చెప్తే ఈ సినిమాలో శ్రీహరి చెల్లెలుగా నటించింది.
Advertisement
Also read:
శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీహరి లోకల్ మాఫియా డాన్ గా కనపడ్డారు ఈ మూవీలో జెనీలియా పెళ్లికి ముందే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తరుణ్ హీరోగా నటించిన శశిరేఖ పరిణయం మూవీలో సడన్ గా పెళ్లి అని పేరెంట్స్ చెప్పడంతో ఎస్కేప్ అయిపోతుంది. రామ్ హీరోగా వచ్చిన రెడీ సినిమాలో జెనీలియా పూజ పాత్రలో నటించింది. ఇందులో మేనమామలు ఆస్తి కోసం ఆమెకు బలవంతం పెళ్లి చేయాలనుకుంటారు దాంతో ఇంటి నుండి పారిపోతుంది. నా ఇష్టం సినిమాలో కూడా జెనీలియా క్యారెక్టర్ ఇంట్లోంచి జంప్ అవుతుంది. పెళ్ళికి ముందు బయటకు రావడం అనేది ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!