Advertisement
ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటారు కానీ అన్ని జరగవు. జీవితం అందంగా ఉండాలని, బాగుండాలని ఏ కష్టాలు లేకుండా ఉండాలని, ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికీ ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది. జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ ఏడు విషయాలను కూడా వదిలేయడం మంచిది. మరి జీవితం బాగుండాలంటే ఎటువంటి వాటిని వదిలేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ కూడా తమని తాము ఇతరులతో పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకుంటూ ఉండటం వలన మన జీవితమే బాగుండదు. పైగా మనిషి అసమర్ధతకు అసంతృప్తికి దారితీస్తుంది.
Advertisement
ప్రతి ఒక్కరికి సొంత ప్రతి ఆలోచన సొంత ప్రయత్నాలు ఉండాలి భవిష్యత్తుకు ఇవి బాగా దోహదపడతాయి. అలాగే గతంలో జరిగిన విషయాలు గురించి ఆలోచించడం ఆ ఆలోచనలోనే గడపడం మూర్ఖుల లక్షణం. గతం గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన సంతోషం ఉండదు. అలాగే ఓటమి భయం ఉండకూడదు. చాలామంది ఏవైనా ప్రయత్నం చేయాలంటే వెనుకడుగు వేస్తారు ఓటమి భయాలే ప్రధాన కారణాలు. కొన్నిసార్లు చేతి ముందు అవకాశం ఉన్న కూడా ప్రయత్నం చేయడానికి భయపడి పోతారు.
Advertisement
Also read:
అలాగే సెల్ఫ్ చెక్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం అయితే తన గురించి తాను నెగిటివ్ గా సెల్ఫ్ చెక్ చేసుకునే వ్యక్తి జీవితంలో పైకి వెళ్ళలేదు పైగా ఎందులోనూ గెలవలేడు అలానే చాలామంది తమను తమ పర్ఫెక్ట్ గా ఉండాలని పర్ఫెక్షన్ అని పిలిపించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. అయితే ఎవరూ అన్ని విషయాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. చేస్తున్న పనిలో పురోగతి ఉందా? విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత మెరుగయ్యారు అనేది చూసుకుంటే సరిపోతుంది. అలానే చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్ చేయడం కొందరికి అలవాటు ఇలాంటి అలవాటు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉండలేరు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!