Advertisement
సినీ పరిశ్రమలు పెళ్లిళ్లు, బ్రేకప్ లు కామన్ ఇక మరి కొంతమంది అయితే ఏళ్ల తరబడి డేటింగ్ చేస్తారు కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోరు. మరి కొంతమంది ఎంత వయసుకు వచ్చినా పెళ్లి జోలికి వెళ్లకుండా సింగిల్ గా గడిపేస్తుంటారు. అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 50 దాటిన సింగిల్ గానే బ్రతుకుతున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
పెళ్లి చేసుకోని హీరోయిన్లలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు టబు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో టబు హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. టబు వయసు 50 దాటిపోయింది. కానీ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది.
హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుస్మిత సేను కూడా పెళ్లికి దూరంగానే ఉంది. సుస్మిత వయసు కూడా 50 దాటింది. పెళ్లికి దూరంగా ఉంది కానీ సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటుంది.
Advertisement
పెళ్లికి దూరంగా ఉన్న మరో హీరోయిన్ శోభన. తన డ్యాన్స్ తో శోభన ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. శోభన 50 ఏళ్లు దాటి 51 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టింది. కానీ పెళ్లికి మాత్రం శోభన దూరంగా ఉంది.
బాలీవుడ్ హీరోయిన్ దివ్యదత్త కూడా పెళ్లికి దూరంగానే ఉంది. తనకు ఇప్పటివరకు సరైన జోడి దొరకలేదని అందుకే పెళ్లికి దూరంగా ఉన్నానని చెబుతుంది దివ్యదత్త.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన అమీషా పటేల్ కూడా పెళ్లికి దూరంగానే ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి అమీషా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 46 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగానే ఉంది. ఇక వీరితో పాటు సితార, నగ్మా కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!