Advertisement
చాలామంది పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే అసలు పురుషుల్లో బట్టతల ఎందుకు వస్తుంది…? దాని వెనుక కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బట్టతల రావడం వెనుక పలు కారణాలు ఉంటాయి. ఈ కారణాల వలన బట్టతల వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పెద్దవాళ్ల నుండి చిన్న వాళ్ళ దాకా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఒకరి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. కొంత మందికి జుట్టు ఎక్కువగా రాలినా మళ్లీ తిరిగి వస్తుంది.
Advertisement
Also read:
కొంత మందికి మాత్రం జుట్టు మళ్ళీ రాకుండా బట్టతల కలుగుతుంది. అయితే ఈ జుట్టు రాలడానికి, బట్టతల రావడానికి అనేక ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి. మరి అవేంటంటే… పురుషుల్లో బట్టతల రావడానికి ముఖ్యమైన సమస్య వంశపారంపర్య పరిస్థితి. తండ్రీ లేదా తాతలకు బట్టతల ఉంటే ఇది వారసత్వంగా వస్తుంది. బట్టతల రావడానికి ఇంకొక కారణం ఏంటంటే హార్మోన్ల సమతుల్యత లేకపోవడం. ఇలా ఈ సమస్య జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
Advertisement
Also read:
దీర్ఘకాలిక ఒత్తిడి వలన జుట్టు అధికంగా రాలిపోతుంది. వ్యాయామం లేకపోవడం, ధూమపానం జుట్టు పెరుగుదలతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే కొన్ని వైద్య పరిస్థితులు చికిత్సలు పురుషుల బట్టతలకు దోహదం చేస్తాయి. కీమోథెరపీ రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తాత్కాలిక లేదా శాశ్వత బట్టతలకు దారితీస్తాయి సో ఇవి బట్టతల రావడానికి గల కారణాలు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!