Advertisement
చాలామంది పెద్దవాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు పెద్దవాళ్లలో ఎందుకు నిద్రలేమి సమస్య ఉంటుంది..? దాని వెనక కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది నిద్రపోవడానికి చిన్నపాటి యుద్ధమే చేస్తారు. బెడ్ మీదకు వెళ్లి ఎంత కష్టపడినా కూడా నిద్ర పట్టదు. దీనికి మన లైఫ్ స్టైల్ లో కొన్ని పొరపాట్లు కారణం అవ్వచ్చు. అయితే ఎందుకు నిద్ర పట్టదు..? నిద్రలేమి సమస్యను ఎందుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది చూద్దాం. రోజులో కాఫీ టీలు భాగం అయిపోయాయి. మీ మూడ్ ని మార్చడానికి ఈ సహాయపడే టీ కాఫీలు నిద్రలేమికి కారణం అవ్వగలవు.
Advertisement
వీటిని సాయంత్రం పూట తీసుకోవడం మంచిది కాదు. అలాగే చాలామంది ఆకలికి రాత్రి సమయంలో తిని ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. దీని వలన కూడా అస్సలు నిద్ర పట్టదు అలానే తరచూ మీ పని వేళలు మారుతూ ఉంటే మీ నిద్రకు భంగం కలుగుతుంది పని ఆలస్యం అవ్వడం లేదంటే రాత్రులు మెలకువగా ఉండడం వలన తదుపరి రోజు కూడా ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. యాంగ్జైటీ డిసార్డర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒత్తిడి బాగా పెరుగుతుంది. నిద్ర కూడా రాదు. ఇలా నిద్రలేమిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
Also read:
అదేవిధంగా స్మోకింగ్ కూడా నిద్ర పై ప్రభావం చూపిస్తుంది నిద్ర ప్రతీ ఒక్కరికి చాలా అవసరం కానీ కొందరు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వరు. ఇతర పనుల మీద దృష్టి పెడతారు. శరీరం అవసరం తెలుసుకోవాలి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండకపోతే కూడా నిద్ర పట్టదు. ఒత్తిడి పెరిగి నిద్ర కూడా పట్టదు. ఒత్తిడి వివిధ కారణాలతో వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, విద్య ఇలా అనేక సమస్యలు నిద్రని భంగం కలిగిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే కూడా సరిగా నిద్ర పట్టదు. చెడు ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి వలన గుండె సమస్యలు కూడా వస్తాయి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!