Advertisement
ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ పలు సమస్యలు వస్తూ ఉంటాయి. వైవాహిక జీవితంలో చాలా మంది అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. అయితే వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. వైవాహిక బంధం బాగుండాలంటే కచ్చితంగా భార్యాభర్తలు వీటిని ఫాలో అవ్వాలి. ప్రస్తుతం చాలామంది భార్యాభర్తల బంధం బలహీనంగా మారింది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వలన చాలా మంది వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. వైవాహిక జీవితం దృఢంగా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి.
Advertisement
నిత్యం చేసే చిన్న చిన్న పనులు జీవిత భాగస్వామితో కలిసి ఉండేలా చేస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లడం, కలిసి డిన్నర్ చేయడం, కలిసి కాఫీ తాగడం వంటివి కచ్చితంగా పాటించండి. అలానే జాయింట్ వెల్నెస్ కార్యక్రమాల్లో పాల్గొనండి దీంతో మీ బంధాన్ని మరింత దృఢంగా ఉంచుకోవచ్చు. యోగా, ధ్యానం, రన్నింగ్ వంటివి కలిసి చేస్తే కూడా మంచిది. ఇద్దరు తమ ఆలోచనలను భావాలను షేర్ చేసుకోవడం మంచి అలవాటు. ఇలా చేస్తే ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది.
Advertisement
Also read:
అలానే ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం ఫోన్స్ తో ఎక్కువ సేపు గడుపుతున్నాం అందుకని మీ జీవిత భాగస్వామితో ఉండేటప్పుడు మొబైల్ ఫోన్ లాప్టాప్ వాడకం తగ్గించి ప్రేమగా ఉండండి. ఎప్పుడూ ఉండే రొటీన్ లైఫ్ కాకుండా అప్పుడప్పుడు ఆహ్లాదకరమైన ప్రదేశాలకి టూర్ వెయ్యండి. ఇది మీ ఇద్దరి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. మనలో అన్ని విషయాలు మన భాగస్వామికి నచ్చాలని లేదు. అందుకే వారు మీలో ఏదైనా విషయంలో నెగిటివ్ అభిప్రాయాన్ని చెప్పారంటే దానిని మీరు అంగీకరించండి. కోపాన్ని తగ్గించుకోండి. అలానే గతాన్ని వదిలేయండి. మీరిద్దరూ ఉన్నప్పుడు ఎప్పుడూ గతంలో జరిగిన గొడవల గురించి మాట్లాడుకోవద్దు. దాని వలన మీ మధ్య ప్రేమ తగ్గిపోతుంది. దూరం పెరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!