Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఉదయం లేచిన వెంటనే ఇలా చేశారంటే డిప్రెషన్ సమస్య ఉండదు. డిప్రెషన్ లేకుండా ఉండడానికి ఇలా చేయాలి. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో చాలామంది రకరకాల సమస్యలు కారణంగా డిప్రెషన్ కి గురవుతున్నారు. కొందరు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. మానసిక రుగ్మత నుండి బయటపడడానికి ఉదయం లేచిన వెంటనే కొన్నిటిని పాటించాలి ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీసుకున్నాక, నవ్వు వచ్చే జోక్స్ వంటివి చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది లేదంటే కాసేపు మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. డిప్రెషన్ తో బాధపడే వ్యక్తులు నిద్ర లేవడానికి బద్దకిస్తాను. బయట ప్రపంచం నచ్చదు.
Advertisement
Also read:
Advertisement
మానసిక సమస్యల నుండి బయట పడాలంటే ఉదయం నిద్ర లేవడానికి ప్రయత్నం చేయాలి. అలానే మీ పనులు చేసుకుంటూ మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవాలి. యోగ వ్యాయామం చేస్తే బాగుంటుంది. అలానే డిప్రెషన్ లేకుండా ఉండడానికి స్నేహితులతో కుటుంబ సభ్యులతో కాసేపు గడపడం మంచిది. ఇలా మాట్లాడటం వలన సమస్యలు తగ్గుతాయి. సంతోషంగా ఉండడానికి అవుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు మరుసటి రోజు ఏం చేయాలో ఒక ప్లాన్ చేసుకోండి.
Also read:
దీని వలన పనుల మీద ధ్యాస పెట్టడానికి అవుతుంది. మరో ఆలోచన రాదు. నచ్చింది తింటే కూడా డిప్రెషన్ తగ్గుతుంది ఉదయం లేవగానే అల్పాహారం చేయడం, పండ్లు బాగా తినడం, లంచ్ డిన్నర్ లో మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఉన్నది ఒకటే ఒక జీవితం అని గుర్తు పెట్టుకుని జీవించినంత కాలం సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఇతరులని సంతోష పెట్టండి. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అప్పుడు ఆనందంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!