Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. జీర్ణశక్తిని బాగు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి బాగుంటుంది. జీర్ణశక్తి బాగుండాలంటే మరి ఏం చేయాలో నిపుణులు చెప్పిన విషయాలని ఇప్పుడు చూద్దాం. అరటిపండ్లలో ప్రిబయోటిక్స్ ఫైబర్ తో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తాయి. తద్వారా మలబద్ధకం వంటి సమస్యల్ని తొలగించగలవు.
Advertisement
అలానే ఉల్లిపాయలోని ప్రీబయోటిక్స్ పేగుల్లోని బ్యాక్టీరియా నశించకుండా కాపాడతాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే వెల్లుల్లిలోని ప్రీబయోటిక్స్ జీర్ణాశయానికి మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు పేగుల్లో బ్యాక్టీరియాని రక్షిస్తాయి. తద్వారా జీర్ణక్రియను కాపాడొచ్చు. యోగర్ట్ లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తాయి తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. అలాగే కించి కూడా జీర్ణ సమస్యలు తొలగిస్తుంది.
Advertisement
Also read:
Also read:
జీర్ణశక్తిని బాగు చేస్తుంది. పులియబెట్టిన కూరగాయలతో ఈ కొరియన్ డిష్ తయారు చేస్తారు దీనిలో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే అవకాడో పండ్లు తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. ఇలా ఈ ఆహార పదార్థాలతో జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు తద్వారా ఆరోగ్యాన్ని కూడా మరింత మెరుగుపరచుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈరోజే మొదలు పెట్టేయండి జీర్ణశక్తిని మరింత పెంపొందించుకోండి. జీర్ణ సమస్యలకు దూరంగా ఉండండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!