Advertisement
ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లని కూడా తీసుకొస్తుంది. వాట్సాప్ వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈజీగా మనం ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేసుకోవచ్చు. అలానే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఫోటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు మీకు తెలుసా..? వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇందులోనే మనం ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. మెటా ఫీచర్ ని చాలామంది వాడుతున్నారు. ప్రస్తుతం ఇది చాట్ బాట్ లాగ పని చేస్తోంది.
Advertisement
మెసేజ్లకు రిప్లై రాయడం లేదా వాటి సారాంశాన్ని రాయడం వంటి పనులు కూడా చేస్తుంది. ఏదైనా సమాచారం కావాలంటే కూడా ఇందులో మనం పొందొచ్చు ఫోటోలు క్లిక్ చేసిన తర్వాత వాటిని ఎవరికైనా పంపే ముందు ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎంతో శ్రమ పడాలి. చాలా మంది వినియోగదారులకు ఫోటోలను ఎడిట్ చేయడం చాలా సమయం తీసుకునే పని. ఫోటోలని ఒక్కొక్కటిగా ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు.
Advertisement
Also read:
అటువంటి పరిస్థితిలో మెటా ఏఐ ద్వారా ఈజీగా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. వాట్సాప్ తన కొత్త ఫీచర్లను బీటా వెర్షన్ పరీక్షిస్తుంది. ఎంపిక చూసిన వినియోగదారులకు మాత్రమే యాక్సిస్ ఉంది. కొన్ని అప్గ్రేడ్ల తర్వాత ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ఈ ఫోటోలో కనిపించే సబ్జెక్టుల గురించి ఏఐ ని అడిగి తెలుసుకోవచ్చు. వినియోగదారులకు త్వరలో రిప్లై ఎడిట్ ఫోటోల ప్రత్యేక బటన్ ఇస్తారు. దీని సహాయంతో చాట్ లో మీ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత ఫోటోలోని సమాచారం అడగడమే కాకుండా ఎడిట్ కూడా చేయడానికి అవుతుంది. టెక్స్ట్ బార్ లోని ఎమోజి పక్కన కెమెరా ఏఐ చూపిస్తూ కొత్త ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. దాన్ని టాప్ చేయడం ద్వారా యూజర్లను ఫోటోలను పంపవచ్చు. ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!