Advertisement
ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు జీవితంలో మంచి పొజిషన్ లోకి వెళ్తే చూడాలని కోరుకుంటూ, అన్నిట్లో ముందు ఉండేటట్టు ప్రోత్సహించాలి. అలాగే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా ఉండడానికి చూడాలి. ఈ అలవాట్లు చిన్నారులు ఐక్యూ లెవెల్స్ ని పెంచుతాయి. పైగా పిల్లలు అన్నిట్లో కూడా ముందుంటారు చురుకుగా ఉంటారు. పిల్లలు చిన్నప్పటి నుండి ఐక్యూని పెంపొందించడానికి తల్లిదండ్రులు వాళ్ళను ప్రోత్సహించాలి. దీంతో వారిలో ఏమైనా సాధించాలనే పట్టుదల ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బలమైన కోరిక ఉంటుంది.
Advertisement
అలాగే పిల్లలు రీడింగ్ పై అభిరుచిని పెంచాలి ఇలా చేయడంతో వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏదైనా విషయం పట్ల క్షుణ్ణంగా ఆలోచించే గుణం వాళ్ళల్లో ఉంటుంది. పిల్లల్లో సంగీతం పై ఆసక్తిని కలిగించే విధంగా చూడాలి. దీని కోసం వారికి చిన్నప్పటి నుండి ఏదైనా సంగీత వాయిద్యంలో ప్రావీణ్యం కలిగే విధంగా ప్రోత్సహించాలి. పజిల్ సాల్వింగ్ చేయడంతో పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది. దీని వలన మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. చిన్నతనం నుండి చిన్న చిన్న వ్యాయామ పద్ధతుల్ని పిల్లలకు అలవాటు చేయాలి.
Advertisement
Also read:
దీంతో ఆరోగ్యంతో పాటుగా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. పిల్లలకు కొత్త భాష నేర్చుకోవడం ఇష్టం. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడంతో పిల్లలలో కొత్త విషయాలు తెలుసుకునే అభిరుచి కలుగుతుంది. దీని వలన వాళ్ళలో సృజనాత్మకతత పెరుగుతుంది అలాగే పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ కూడా చిన్నప్పటి నుండి డెవలప్ చేయాలి. దీంతో ఆలోచన శక్తి పెంపొందించుకోవచ్చు. పదేళ్లు దాటిన తర్వాత పిల్లలకు కోడింగ్ ప్రోగ్రామింగ్ వంటి వాటి మీద అవగాహన కల్పించాలి. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఏదైనా ఐటి కోర్స్ నేర్చుకోవడానికి వాళ్ళకి సహాయపడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!