Advertisement
ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని ఉంటుంది. అయితే అందంగా ఉండడం కోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు వలన కూడా అందం తగ్గిపోతుంది. ముఖం పాడైపోతుంది. ఈ విషయాలు తెలిస్తే చర్మానికి ఐస్ పెట్టరు. చాలా మంది చర్మం బాగుంటుందని ఐస్ తో చర్మాని రుద్దుతూ ఉంటారు. కానీ ఇంత నష్టం కలుగుతుందని ఎవరికీ తెలీదు. చర్మ సౌందర్యం విషయంలో చాలా రకాల ట్రెండ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. స్కిన్ ఐసింగ్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే దీని వలన చాలా నష్టం కలుగుతుందని స్కిన్ స్పెషలిస్టులు అంటున్నారు.
Advertisement
చర్మం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దాని మీద ఐస్ పెట్టడం వలన ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పడిపోతుంది. చర్మం పొడిబారిపోవడం ఎరుపుగా మారిపోవడం ర్యాషెస్ వంటివి రావడం వంటివి కలుగుతాయి. చర్మాన్ని సున్నితమైన బెలూన్ అనుకోవాలి బయట వాతావరణానికి లోపల శరీరానికి ఇది అడ్డు తెరలా ఉంటుంది. ఐస్ ని నేరుగా చర్మం మీద పెట్టడం వలన సున్నితమైన చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
Advertisement
Also read:
చర్మం సున్నితంగా మారి తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. అలానే ఎర్రగా మారే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చర్మంపై ఐస్ పెట్టి రుద్దడం వలన ఎర్రటి మచ్చలు వ్యాపిస్తాయి. ఒత్తిడి బాగా పడుతుంది. చర్మం చిట్లిపోయి ఎర్రటి మరకలు కూడా రావచ్చు. చూడడానికి ర్యాషెస్ లాగా కనిపిస్తాయి. దీర్ఘకాలిక చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు. చర్మం పై ఐస్ రుద్దడం వలన యాక్ని వంటి సమస్యలు ఎక్కువవుతాయి. దీర్ఘకాలిక చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఐస్ పెట్టుకోవడం వలన సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. చల్లటి ఉష్ణోగ్రత వల్ల శరీరంలో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. చర్మం తేమను కోల్పోతుంది దానితో సులువుగా పొడిబారిపోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!