Advertisement
ప్రతి ఒక్కరు కూడా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ ఒక్కోసారి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీ భాగస్వామి ఇలా ఉంటే చాలు లైఫ్ అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. భార్యాభర్తలు రోజంతా పడిన కష్టం దగ్గర నుంచి చిన్న చిన్న ఆనందాల గురించి పంచుకొని సంతోషంగా ఉంటారు. రోజుల్లో కాస్త టైం పెట్టుకుని ఇద్దరు పక్కపక్కనే కూర్చుని అనుభవాలను పంచుకుంటుంటారు. మనసులో వయసు పెరిగిందని అనుకున్నప్పుడు నిజంగా ముసలివారిలా ఫీల్ అవుతారు కాబట్టి ఎప్పుడు యంగ్ గా ఉన్నామని భావించాలి.
Advertisement
అలాగే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం, సరదాగా కూర్చుని మాట్లాడుకోవడం చేస్తే బంధం మరింత దృఢంగా మారుతుంది. ఒక జంట ఎంత దగ్గరగా ఉండి మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ కష్టాలను వాళ్ళ ఇష్టాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి ఇలా చేయడం వలన అపార్ధాలు ఉండవు. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే భార్యాభర్తల మధ్య బంధం ఎప్పుడు దృఢంగానే ఉంటుంది. వాళ్ళ మధ్య అపార్ధాలు వంటివి రావు సంతోషంగా ఉండడానికి అవుతుంది.
Advertisement
Also read:
Also read:
భార్యాభర్తల కి వేరువేరు పనులు ఉంటాయి. కానీ ఇద్దరూ కూడా కాస్త సమయాన్ని ఒకరికోసం ఒకరు వెచ్చించాలి. అలాగే ఫిజికల్ రిలేషన్ షిప్ ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తు పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య ఘర్షణలని సాగదీయకుండా ఎప్పటికప్పుడు వీలైనంతవరకు లైట్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది అంతే కానీ ఏదైనా చిన్న గొడవ జరిగిన మాట అనుకున్నా అనవసరంగా దానిని సాగదీసుకుంటూ వెళ్ళిపోకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!