Advertisement
చాలామంది మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతుంటారు. మ్యూజిక్ వింటే ఎన్నో లాభాలు ఉంటాయి. మ్యూజిక్ వినడం వలన ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కొంతమంది మ్యూజిక్ వినడానికి ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు జర్నీ సమయంలో మంచి మూడ్లో ఉన్నప్పుడు పాటలు వింటూ ఉంటారు. మ్యూజిక్ వినడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే మ్యూజిక్ వలన మూడ్ బాగా లేనప్పుడు సంగీతం వింటే మంచి మూడ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. బాడీకి ఉల్లాసాన్ని కలిగించే డోపమైన్ హార్మోన్ సంగీతం తినడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Advertisement
Advertisement
మ్యూజిక్ వినడం వలన ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. వర్కౌట్ సమయంలో మ్యూజిక్ వినడం వలన బద్ధకం ఉండదు. ఉల్లాసంగా ఉండొచ్చు. మీకు స్ఫూర్తిని కూడా ఇది పెంచుతుంది. అదేవిధంగా మ్యూజిక్ వింటే జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన పాట వింటున్నప్పుడు మీరు చాలా జ్ఞాపకాలని ఊహించుకుంటారు. అలాగే కొంతమంది నిద్ర రాక మ్యూజిక్ వింటూ ఉంటారు అప్పుడు మనసుకి ఆహ్లాదాన్ని అందించే పాటలు వినడం చాలా మంచిది.
Also read:
మోటివేషన్ పెంచాలనుకుంటే మంచి మ్యూజిక్ వినండి. ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మీలో స్ఫూర్తి కలిగించే పాటలు వింటే ఉల్లాసం ఎక్కువ అవుతుంది. సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ వింటే బాడీలో డోపామైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ వింటే ఒత్తిడి మాయం అయిపోతుంది. అయితే ఎక్కువగా మ్యూజిక్ వినడం వలన చెవులు డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!