Advertisement
తొలి ఏకాదశి నాడు కొన్ని తప్పులు చేయకూడదు. తొలి ఏకాదశి నాడు కొన్ని తప్పులు చేయడం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హిందువులకు ఏకాదశి తిధి ముఖ్యమైనది. ప్రతి మాసంలో కృష్ణ శుక్లాపక్ష ఏకాదశి తిధి ప్రపంచాన్ని పోషించే విష్ణు ఆరాధనకు అంకితం చేయడం జరుగుతుంది. శుభ ఫలితాన్ని పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా చాలా మంది ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన జన్మ జన్మల్లో చేసిన పాపాలను నశిస్తాయట. ఆషాడ మాసంలో దేవశైని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశిష్టమైనది. తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లారు. ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు.
Advertisement
Advertisement
ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. భగవంతుని ఈ నాలుగు నెలలు ఎక్కువగా పూజిస్తారు. పంచాంగం ప్రకారం ఆషాడ మాసంలో తొలి ఏకాదశి జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:03 గంటలకు ప్రారంభమై జూలై 17న బుధవారం రాత్రి తొమ్మిది రెండు గంటలకు ముగుస్తుంది. తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకోవాలి. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తల స్నానం చేసి పసుపు రంగులో దుస్తులు వేసుకోవాలి. మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధించాలి.
Also read:
ఏకాదశి ఉపవాసం చేయాలి. ధాన్యాలు, వస్త్రాలు దానం చేస్తే ఎంతో మంచిది. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకుల్ని కచ్చితంగా పెట్టండి. ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే… ఈ రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. అన్నంతో చేసిన ఆహారం తినకూడదు. గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఎరుపు లేదా పసుపు రంగులో దుస్తులు మాత్రమే ధరించాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరులు పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. అలాగే స్త్రీలను పెద్దల్ని అవమానించకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!