Advertisement
చాలామంది వంటల్లో నువ్వులను వాడతారు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులతో అనేక లాభాలను పొందడానికి అవుతుంది. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది. అలాగే వీటిలోని విటమిన్ బి1, వన్ బి త్రీ, బి6 ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు నువ్వుల్ని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ శక్తివంతంగా మారుతుంది. నువ్వుల్లోని ఫైబర్ పేగులు ఆరోగ్యానికి జీర్ణశక్తి మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. అలాగే నువ్వుల్ని తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వీటిలోని అధిక ప్రోటీన్ వలన మంచి కొవ్వులు పెరిగి చెడు కొవ్వులు తగ్గిపోతాయి. అలాగే నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది.
Advertisement
Advertisement
ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయం చేస్తుంది. ప్రతిరోజు నువ్వుల్ని తీసుకోవడం వలన రక్తం శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమ్మేళనాలు నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి. రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా వీటి వల్ల పెరుగుతుంది. వీటిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also read:
ఇలా అనేక లాభాలని పొందవచ్చు. అలాగే నువ్వుల్లో క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పని చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి. థైరాయిడ్ సమస్య నుండి కూడా ఉపశమనాన్ని నువ్వులిస్తాయి. రక్తపోటు కూడా పెరిగిపోకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!