Advertisement
తమిళ మూవీ ఇండస్ట్రీలో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడు కలిసి చేసిన భారతీయుడు 2 మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకే వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మీద అందరూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. ఈ మూవీ కంటెంట్ పరంగా ఓకే అనిపించినా దానికి ఒక ముగింపు మాత్రం ఇవ్వలేకపోయారు. భారతీయుడు 2 వస్తుంది అనే అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుండి కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదు.
Advertisement
భారతీయుడు 3 కూడా రాబోతోందని భారతీయుడు 2 సినిమా చివర్లో సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. మొత్తానికి అయితే ఈ సినిమా వచ్చిన ప్రేక్షకులు ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 మూవీ వచ్చినప్పటికీ ఈ మూవీ ఈ నెలాఖరికి ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇంత తొందరగా ఓటీటీ లోకి వస్తుందా అని మరికొందరు షాక్ అవుతున్నారు.
Advertisement
Also read:
ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సినిమా నెలాఖరుకు వస్తుందని అభిప్రాయాలు అయితే వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్త్రిమింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్లు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ సినిమా ఓటిటి రైట్స్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో అంతలా రెస్పాన్స్ రాలేదు. ఓటీటీ లో మరి ఎలా రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!