Advertisement
మనం ఏదైనా కొత్త వస్తువుని కొనుగోలు చేసినా లేదంటే మందుల్లో, బాటిల్స్, బాగ్స్, చెప్పులు వంటి వాటిలో తెల్లని పాకెట్లను చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా ఈ ప్యాకెట్లు ఏంటా అని మీరు గమనించారా..? అయితే అసలు ఇవి ఎందుకు ఉంటాయి..? దాని గురించి చూద్దాం.. వీటిని సిలికా జెల్ అని అంటారు ఈ ప్యాకెట్లను కొత్త వస్తువుల్లో పెడతారు వీటిని పెట్టడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా తేమని ఇది గ్రహిస్తుంది కాబట్టి వస్తువు పాడైపోకుండా ఉంటుంది. ఈ బ్యాగుల వలన మనం కూడా అనేక ఉపయోగాలని పొందవచ్చు. ఎప్పుడైనా మొబైల్ తడిచినప్పుడు మొబైల్ ని ఒక కవర్లో పెట్టి కొన్ని సిలికా బ్యాగులని అందులో వేసేస్తే తడిని అవి అబ్సార్బ్ చేసుకుంటాయి.
Advertisement
Advertisement
వర్షాకాలంలో లెదర్ షూస్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు వాసన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ సిలికా జల్ ప్యాకెట్స్ పెట్టడం వలన అవి తేమని గ్రహిస్తాయి. వంటింట్లో వెండి లేదా అల్యూమినియం వస్తువులు పెట్టినప్పుడు మీరు అక్కడ ఈ ప్యాకెట్స్ ని పెడితే అవి తడిని గ్రహిస్తాయి. వస్తువులు పాడైపోకుండా ఉంటాయి. వర్షాకాలంలో పర్సులో ఈ బ్యాగులను ఉంచుకుంటే మంచిది.
Also read:
Also read:
పర్సు నుండి వచ్చే దుర్వాసనను ఇది పోగొడుతుంది. బట్టలు అల్మారా లో తడి లేదా వాసన ఉంటే అక్కడ సిలికా జల్ ప్యాకెట్లను పెట్టండి వాసన రాకుండా ఉంటాయి. ఐరన్ పాత్రలలో వీటిని పెట్టడం వలన తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇలా మనం ఈ ప్యాకెట్లను వాడుకోవచ్చు. ఇన్ని లాభాలని పొందవచ్చు. చాలా వస్తువుల్ని పాడైపోకుండా కాపాడుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!