Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్సర్లుగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వంటి వాళ్ళు అందర్నీ మెప్పించారు. వాళ్ళ డాన్సులతో ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో అవకాశాలని పొందారు. జ్యోతిలక్ష్మి అందరికంటే ముందు ఇండస్ట్రీలో అడుగు పెట్టి వేయి కంటే ఎక్కువ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో చేశారు. 300 సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు కూడా పోషించారు. ఈమెకు పోటీగా జయమాలిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జ్యోతిలక్ష్మికి ఈమె సొంత చెల్లెలు అవుతుంది. కానీ వీరి మధ్య అక్క చెల్లెలు బంధం లేదు. చిన్నప్పటినుండి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదట. ఈ సిస్టర్స్ తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టారు. వీళ్ళు మొత్తం ఐదుగురు పిల్లలు. ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు.
Advertisement
వారిలో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దది జయమాలిని ఆఖరి వారు. పి. యల్ ధనలక్ష్మి జ్యోతిలక్ష్మిని చిన్నతనంలోనే అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి అక్కాచెల్లెళ్ల మధ్య పెద్దగా మాటలు ఉండేవి కాదట. జ్యోతిలక్ష్మి జయమాలిని అనేక సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అప్పుడు కూడా మాట్లాడుకునేవారు కాదట. షూటింగ్ అయిపోయిన వెంటనే ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయేవారిట. ఇద్దరు మధ్య పేగు బంధం ఉన్నా ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని అడిగినప్పుడు జయమాలిని దానికి కారణం చెప్పారు. జ్యోతిలక్ష్మి సినిమాల్లోకి వచ్చాక డబ్బు బాగా సంపాదించారని ఆ సమయంలో తమ కుటుంబాన్ని ఆర్థికంగా పేద స్థితిలో ఉందని అందువలన జ్యోతిలక్ష్మి చులకనగా చూసే వారిని జయమాలిని చెప్పారు.
Advertisement
Also read:
జయమాలిని తన అక్క జ్యోతిలక్ష్మి ఇంటికి వెళ్లిన రానిచ్చేవారు కాదని ఆమె అన్నారు. బయటకి వెళ్ళిపోతున్నామని చెప్పి బయట నుండే పంపించేసేవారట. ఇటువంటి అవమానాలను చాలా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. పెంపుడు తల్లి కోరిక మేరకు వాసుదేవన్ అనే ఒక వ్యక్తిని జ్యోతిలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. అతనికి అప్పటికే ఒక అమ్మాయి తో పెళ్లయింది అందుకే వీరిద్దరూ సీక్రెట్ గా ఎనిమిదేళ్లపాటు సహజీవనాన్ని కొనసాగించారు. వాసుదేవన్ మొదట్లో మంచిగా ఉన్న తర్వాత ఆమెని టార్చర్ చేసేవారట సినీ నిర్మాతలతో గొడవలు కూడా వచ్చాయట దాంతో జ్యోతిలక్ష్మికే అవకాశాలు తగ్గిపోయేట చివరికి వాసుదేవతో తనకు ఎలాంటి అఫైర్ లేదని చెప్తూ సినిమా ఆటోగ్రాఫర్ సాయి ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!