Advertisement
బాలీవుడ్ నటి జాన్వి కపూర్ అనారోగ్య సమస్యకి గురైనట్లు తెలుస్తోంది. ఈమె ఆరోగ్యం బాగోక పోవడంతో ఆసుపత్రిలో ఎడ్మిట్ అయ్యారట. జాన్వి కపూర్ ముంబై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అనే విషయం తెలియడంతో ఒకసారిగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు తనకు ఏమైంది..? ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
Advertisement
అభిమానులు ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడంతో బోనీ కపూర్ ఆమె ఆరోగ్యం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని చెప్పారు. తన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కంగారు పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.
Advertisement
Also read:
Also read:
జాన్వి తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా దేవర తో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా చేయడానికి ఈమె కమిట్ అయ్యారు. మరి ఆ సినిమాలు ఎంతలా మెప్పిస్తాయి అనేది చూడాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!