Advertisement
ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటారు. మీరు కూడా బాగా పైకి రావాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా బాగా చదువుకోవాలి. చదివింది గుర్తుండడం చాలా ముఖ్యం. చాలా మంది ఎక్కువసేపు చదువుతూ ఉంటారు. రోజుకి 10,12 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. చదివింది గుర్తుండాలంటే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి. విద్యార్థులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చదివింది గుర్తుంచుకోవడం చాలా అవసరం. కొందరు కొన్ని రోజుల్లోనే చదివింది మర్చిపోతూ ఉంటారు.
Advertisement
పరీక్షలు వరకు గుర్తుండే ఉండదు. అలాంటి వాళ్ళు ఈ టిప్స్ ని పాటించడం మంచిది. ఎర్ర ద్రాక్ష పండ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి. ఎర్ర ద్రాక్ష మెదడును చురుకుగా మారుస్తుంది. చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే బ్లాక్ బెర్రీస్ తీసుకుంటే కూడా చదివింది బాగా గుర్తుంటుంది. మెదడు పని తీరు మెరుగుపడుతుంది. మెదడును చురుకుగా మార్చడానికి ఒమేగా త్రీ యాసిడ్స్ సహాయపడతాయి. అందువలన ఇవి ఎక్కువగా లభించే సాల్మన్ వంటి కొవ్వు చేపల్ని తీసుకోవడం మంచిది.
Advertisement
Also read:
బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా, ఎండుద్రాక్ష వంటి వాటిని తీసుకుంటే కూడా చదివింది బాగా గుర్తుంటుంది. ఏకాగ్రతని పెంచుకోవడానికి కూడా అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీనిలోని పోషకాలు మెదడుకి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చదువుకునే వాళ్ళు రోజూ ఒక గుడ్డు తింటే మంచిది. గుడ్లలో కోలిన్ అనే సమ్మేళనం సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి. నా మెదడు చురుగ్గా పనిచేయాలని హైడ్రేట్ గా ఉండాలి. అందుకోసం శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!