Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అనేక పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కూడా అందాలి. ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్యాల్షియం తక్కువగా ఉంటే ఎముకల సమస్యలు వంటివి కలుగుతాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. పాలు, పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలపై ఎముకలు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి లాక్టోస్ సరిపడా ఉండవు. పాలు తాగితే కడుపులో ఎక్కువసేపు ఉండవు వెంటనే వాంతులు అవ్వడం వంటివి జరుగుతాయి. అయితే పాలు తీసుకోకపోతే శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది..? ఈ సందేహం మీలో కూడా ఉందా అయితే పాలకి బదులు ఏం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం పాలు పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.
Advertisement
Advertisement
శరీరంలో క్యాల్షియం స్థాయిలపై ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలామందికి లాక్టోస్ సరిగా ఉండవు అందువలన వాళ్ళు పాలు తాగితే కడుపులో ఎక్కువసేపు ఉంచుకోలేరు. పాలకి బదులు అలసందలు తీసుకుంటే మంచిది. అలసందుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకు బదులు అలసందులు తీసుకోవచ్చు. టోఫు అనేది చీజ్ లాగ కనిపించే ఒక రకమైన ఆహారం ఇందులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజు తీసుకోవడం వలన శరీరంలో క్యాల్షియం లోటు ఉండదు.
Also read:
బ్రోకలీలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతో మంచి కూరగాయ దీనివలన ఎముకలు దృఢంగా మారుతాయి. సాల్మన్ చేపల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. సాల్మన్ చేపల్ని తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్యాల్షియం సమస్య ఉండదు. అలాగే కాలే కూడా కాల్షియంతో నిండి ఉంటుంది ఈ కూరగాయ శరీరానికి క్యాల్షియం అందించడమే కాకుండా కణాలను నష్టాన్ని కూడా నివారించేందుకు సహాయం చేస్తుంది. ఇలా వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు పాలకి బదులు వీటిని తీసుకుంటే ఏ సమస్య రాదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!