Advertisement
ప్రస్తుతం భారతదేశంలో చాలా వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జాతీయ హైవేలపై వాహనదారులకు కొత్త విధానం తెచ్చి టోల్ ప్లాజా ద్వారా రేట్లు విపరీతంగా పెంచారు. ఈ కొత్త రేట్ల ప్రకారం కిలోమీటర్లు, వాహనాన్ని బట్టి ఐదు రూపాయల నుంచి 50 రూపాయల వరకు వాహనదారులపై అదనపు భారాన్ని పెంచేశారు. ఈ విధంగా టోల్ టాక్స్ పెంపు వల్ల బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని రద్దు చేసి టోల్ వసూళ్లపై కొత్త విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
Advertisement
ఈ కొత్త విధానంలో వాహనాలు హైవే పై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది దాని ప్రకారమే టోల్ మొత్తం వసూలు చేయనున్నట్టు యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కారీ తెలియజేశారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దీని ప్రకారం చూస్తే ఒక టోల్ నుంచి వాహనం దాటితే మరొక టోల్ కు ఎంత దూరం ఉందో ఆ మొత్తం దూరానికి టోల్ టాక్స్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత వచ్చే టోల్ దగ్గరికి వెళ్లకపోయినా దీనిలో సగం ఎక్కడైనా పూర్తయిన నెక్స్ట్ టోల్ వరకు పూర్తిగా అమౌంట్ చెల్లించాల్సిందే. కానీ ఈ కొత్త విధానంలో మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారో అంతే టోల్ వసూలు చేయబడుతుంది. యూరప్ దేశాల్లో ఆల్రెడీ ఈ ఫార్ములా సక్సెస్ అవ్వడంతో ఇండియాలోనూ అమలుచేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు.
Advertisement
ప్రస్తుతం మన ఇండియా వ్యాప్తంగా 1.37 లక్షల వాహనాలతో పైలెట్ ప్రాజెక్టు జరుగుతోంది. పక్క దేశాల్లో ప్రతి వాహనంలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. అందువల్ల ఈ విధానం ద్వారానే టోల్ వసూలు చేస్తున్నారు. అలాగే మన దేశంలో ఉన్న ప్రతి వాహనంలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసి, కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ ని వసూలు చేయబోతోందని సమాచారం. అట్టి వాహనం టోల్ చేయబడిన రహదారిలోకి ప్రవేశించిన వెంటనే పన్ను లెక్కింపు ప్రారంభం అవుతుంది. తర్వాత వాహనం ఎన్ని కిలోమీటర్లు వెళితే అంతమాత్రమే టాక్సీ లెక్కింపు చేయబడుతుంది. ఒకవేళ వాహనం టోల్ లేకుండా హైవే నుంచి రోడ్డు పైకి వెళ్ళగానే ఆ కిలోమీటర్ టోల్ ఖాతా నుంచి మినహాయింపు అవుతుంది. ఈ విధంగా కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.
also read:
- స్టార్ హోదాలో ఉండి కమెడియన్స్ తో జోడి కట్టిన హీరోయిన్లు ఎవరంటే..?
- అలనాటి హీరోయిన్ సౌందర్య ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?