Advertisement
రాజ్ తరుణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని రోజుల నుండి రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్నారు. లావణ్య వివాదంలో చిక్కుకున్నారు. నార్సింగ్ స్టేషన్లో రాజ్ తరుణ్ మీద లావణ్య కంప్లైంట్ చేసారు. తనతో సహజీవనం చేసారని, గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్పారు. రెండుసార్లు అబార్షన్ చేయించారని కూడా ఆమె చెప్పారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ తనని దూరం పెడుతున్నాడని వదిలేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని లావణ్య కంప్లైంట్ చేసారు.
Advertisement
లావణ్య కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా, ఆమె బ్రదర్ మయాంక మల్హోత్రాలపై కేసు నమోదు చేసారు. 420 తో పాటుగా మరో రెండు సెక్షన్స్ తో కేసుల నమోదు చేశారు. ఈనెల 18లోగా ఒక విచారణకు హాజరవ్వాలని సూచించారు. రాజ్ తరుణ్ విచారణకి రాలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాను విచారణకు రావడం కుదరదని తన లాయర్ తో లేఖ పంపించారు. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ మాల్వి ప్రైవేట్ వాట్సాప్ చాట్ ఒకటి లీక్ అయ్యింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇవి చూస్తుంటే వాళ్ళ మధ్య నిజంగా ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది. మాల్వి ఈ రూమర్స్ ని ఖండించిన సంగతి విషయం తెలిసిందే.
Advertisement
Also read:
అతను నాకు సహనటుడు మాత్రమే అని అతనితో ఎలాంటి అఫైర్ లేదని చెప్పారు. మాల్వి అబద్ధం చెప్తున్నారని తెలుస్తోంది, ఇటీవల లావణ్య మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన ఆడియో కాల్ సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. లావణ్యతో రాజ్ తరుణ్ రిలేషన్ చాలా కాలంగా కొనసాగుతోంది. 2008లో సోషల్ మీడియా ద్వారా వీళ్ళకి పరిచయం ఏర్పడింది వైజాగ్ బంధువుల ఇంటికి వెళ్లిన లావణ్య మొదటిసారి కలిసింది. 2014లో ప్రపోజ్ చేశాడట. 2014లో వీరికి వివాహమైందని లావణ్య చెప్పారు. రాజ్ తరుణ్ వాదన పరిశీలిస్తే లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ మా మధ్య ఎలాంటి శారీరిక సంబంధం లేదని ఆమెని పెళ్లి చేసుకోలేదని అన్నారు. లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది నన్ను వేధింపులకు గురిచేస్తుందని బ్లాక్మెయిల్ కి పాల్పడేదని అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!