Advertisement
ఆషాడ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుతారు. హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా బోనాలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. లష్కర్ బోనాలు మాత్రం రెండు రోజులపాటు జరుపుతారు. ఆదివారం బోనాలు సోమవారం రంగం. అయితే రంగం రోజు భవిష్యవాణి చెప్పే మాతంగి స్వర్ణలత గురించి మీకు తెలుసా..? అసలు ఎవరు ఈమె..? సాధారణంగా మీరేం చేస్తుంటారు అనే దాని గురించి చూద్దాం. లష్కర్ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది ఎదురుచూస్తూ ఉంటారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు.
Advertisement
ఈమెను సరస్వతి దేవి తో పోలుస్తారు. ఆమె తల్లి కూడా భర్తకు తోడుగా జేగంట మోగించేవారు. స్వర్ణలతకు చిన్నతనంలో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు. తర్వాత మాతంగి స్వర్ణలత జీవితం మహంకాళి అమ్మ సేవకి అంకితం చేశారు. ఈమె పదవ తరగతి దాకా చదువుకున్నారు. తర్వాత భవిష్యవాణి వినిపించడం మొదలుపెట్టారు. వారి కుటుంబంలోని ఆడపిల్లలు అమ్మవారికి అంకితం. 1996 వరకు అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు. ఆమె చనిపోయాక స్వర్ణలత మొదలుపెట్టారు. ఆమె తమ్ముడు తో ఉంటారు. సాధారణ టైలర్ గా ఉంటున్నారు.
Advertisement
Also read:
Also read:
బోనాల సమయంలో కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్ద కుంకుమ, తిలకం, ముక్కుకు ముక్కెర చేతిలో కిన్నెర, మెడలో దండతో భవిష్యవాణి వినిపిస్తారు. మామూలు కొండపై నిలబడితేనే పగిలిపోతుంది. అలాంటిది పచ్చి కొండపై నిలబడి అంతసేపు పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా ఆమెకి తెలియదంట. 25 ఏళ్లుగా ఈమె వినిపిస్తున్నారు. తరతరాలుగా ఇది వస్తుందని అమ్మవారిని తలుచుకుని పచ్చి కుండ పై నిలబడి భవిష్యత్తు గురించి చెప్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!