Advertisement
IAS Krishna Teja: మంచిని గుర్తించడానికి పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేసే మంచి గురించి ప్రత్యేకంగా అభినందిస్తారు. అభినందనలు తెలుపుతారు. తాజాగా ఐఏఎస్ కృష్ణ తేజకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేసారు. కేరళలోని త్రిశూల్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న కృష్ణ తేజకు అభినందనలు చెప్పారు. దీంతో ఎవరు కృష్ణ తేజ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. 2017 బ్యాచ్ కి ఐఏఎస్ బ్యాచుకు చెందిన కృష్ణ తేజ 2023 మార్చి లో కేరళలోని త్రిశూల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
ఆయన స్వస్థలం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట కరోనా సమయంలో త్రిశూల్ అనాధలుగా మిగిలిన 69 మంది విద్యార్థులని గుర్తించారు. వారి ఉన్నత చదువులు చదివేలా చేశారు. భర్తల్ని పోగొట్టుకునే 35 మంది వితంతువులకి పింఛన్లను ఇచ్చారు. అలాగే వాళ్లకు ప్రత్యేకంగా గృహ నిర్మాణం చేపట్టారు. ఇంకో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
Advertisement
Also read:
Also read:
బాలల హక్కుల రక్షణలో దేశంలో త్రిశూల్ జిల్లా అగ్రగామిగా ఉంది. దీనిని గుర్తించిన జాతీయ బాలల హక్కుల కమిషన్ కలెక్టర్ కృష్ణ తేజకు పురస్కారాన్ని ప్రకటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపిక కావడం హర్షణీయం అని అన్నారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు యువతకు స్ఫూర్తి ఇవ్వాలని ఆకాంక్షించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!
cer-krishna-teja-395951.html