Advertisement
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైపోయాయి. తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు ఏపీ అసెంబ్లీ దగ్గర వైయస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో ప్ల కార్డులతో నిరసన చేసారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. చించి వేయడంతో పోలీసు అధికారి పై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కాదు అని మండిపడ్డారు.
Advertisement
ఎల్లకాలం ఉండదని గుర్తు పెట్టుకోవాలని జగన్ అన్నారు. పోలీసులు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అని స్పందించారు. పోలీసును ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్స్ లాక్కుని చించి వేసే అధికారం ఎవరిచ్చారని అన్నారు. ఆ తర్వాత జగన్ ఎమ్మెల్యేలతో కలిసి సభ లోపలకి వెళ్లారు. శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
Advertisement
Also read:
Also read:
సభ లోపల కూడా గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. హత్య రాజకీయాలు నశించాలి. సేవ్ డెమోక్రసీ వి వాంట్ జస్టిస్ అని సభలో నినాదాలు చేశారు. అనంతరం సభ నుండి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు తనని అసెంబ్లీ మెయిన్ గేట్ నుండి వెళ్లనివ్వాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ వస్తున్నారని వేరే గేట్ నుంచి వెళ్ళమని పోలీసులు సూచించారు వెంటనే జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!