Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సినిమాల్లోకి రాక ముందే ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. స్టార్ కిడ్ అయిన సితార ఒక బ్రాండెడ్ నగల కంపెనీ ప్రమోషన్ యాడ్లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. ఇందులో భాగంగా తనకు వచ్చిన రెమ్యూనిరేషన్ ని సైతం సేవా కార్యక్రమాలకు ఇస్తూ ఉంటుంది. పేద విద్యార్థులకు సైకిల్స్ అందించడం, బహుమతులు ఇవ్వడం ఇలా పలు సందర్భాల్లో తన గొప్ప మనసుని ఆమె చాటుకుంది.
Advertisement
ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న ఒక పేద అమ్మాయికి ఆర్థిక సహాయం చేసింది. 2024 లో జరిగిన మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షలో నవ్యశ్రీ అనే అమ్మాయికి 605 మార్కులు వచ్చాయి. సాధారణ కాలేజీలోనే చదివిన ఆమె తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. పేదరికం ఆమె కలలకు అడ్డుగా నిలిచింది. కనీసం పుస్తకాలు, హాస్టల్ ఫీజు కాలేజీ ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో వారి కుటుంబం ఉంది. దీంతో నవ్య చదువుకి సహాయం కావాలి అని మహేష్ బాబు ఫౌండేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని ఆమె సంప్రదించింది.
Advertisement
Also read:
ఆమెకు లక్ష 25 వేల రూపాయల చెక్కుతో పాటుగా మెడిసిన్ విద్య పూర్తి చేయడానికి సంస్థ నుంచి డబ్బు అందుతుందని మహేష్ బాబు ఫ్యామిలీ హామీ ఇచ్చింది. సితార తన పుట్టినరోజు కూడా నవ్యశ్రీ తో సెలబ్రేట్ చేసుకుని ఆమె కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. ఆమె మెడిసిన్ పూర్తి చేసే వరకు హాస్టల్ కాలేజీ ఫీజులన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ అందిస్తుంది. కాబోయే ఈ డాక్టర్ విద్యార్థికి సితార ల్యాప్టాప్, స్కెతస్కోప్ ని బహుమతిగా ఇచ్చింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!