Advertisement
Tips to save electricity: ప్రతి ఒక్కరు కూడా కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే ముఖ్యమైన విషయాల్లో కరెంట్ బిల్లు ఒకటి. అయితే ముఖ్యంగా వేసవికాలంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఏసీ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉండడం వలన కరెంటు బిల్లు పరిగెడుతూ ఉంటుంది. కరెంట్ బిల్ ని ఆదా చేసుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ కరెంట్ బిల్ ని ఆదా చూసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి తయారీదారులు ఉపకరణాల శక్తి సామర్థ్యాన్ని నిర్వహించడానికి బిఈఈ స్టార్ లేబుల్‌ని జారీ చేస్తుంది.
Advertisement
మూడు నుండి ఐదు స్టార్ రేటింగ్ తో ఉన్న ఉపకరిని ఉపకరణాన్ని కొనుగోలు చేస్తే మరింత విద్యుత్ ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇంట్లో చాలా వరకు లైట్లు ఇప్పటికీ సాధారణ బల్బులు వాడతారు. వాటిని ఎల్ఈడి బల్బులతో భర్తీ చేయొచ్చు. అవి విద్యుత్‌ని కూడా ఆదా చేస్తాయి. సాధారణ ఇండక్షన్ మోటార్ ఆధారిత ఫ్యాన్లతో కంపేర్ చేసి చూస్తే బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ ఉన్నవి 60% వరకు విద్యుత్‌ను ఆదా చేయడంలో సహాయపడతాయి. అలాగే విద్యుత్ ని ఆదా చేయాలనుకున్న వాళ్ళు 24 డిగ్రీల దగ్గర ఏసీ ని రన్ చేయడం మంచిది.
Advertisement
Also read:
చాలామంది ఎక్కువగా వేడిగా ఉందని 18 లో పెడుతూ ఉంటారు అలా కాకుండా 24 లేదా 25 వద్దా మీరు ఏసీ ని పెట్టినట్లయితే ఎక్కువ కరెంట్ బిల్ రాదు. కరెంట్ బిల్ ని సేవ్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్ టెక్నాలజీతో కూడిన ఏసీలు ఫ్రిజ్‌లు ఉన్నాయి. కరెంటు పొదుపు కోసం వీటిని కొనుగోలు చేయడం మంచిది. డివైస్ శీతలీకరణ బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఇన్వర్టర్ కంప్రెసర్ తో కూడిన పరికరాలు విద్యుత్ ని సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!