Advertisement
కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలుగు కోడలు నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని కానీ అది దక్కలేదని కేటీఆర్ అన్నారు. 48 లక్షలు 21 వేలు కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారని ఆరోపించారు. మొత్తం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నా అని తీవ్రసహనం వ్యక్తం చేసారు.
Advertisement
ఏపీ పునర్విసన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్ర అనే విజ్ఞప్తి చేశారని అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని చెప్పారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధుల ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాటే లేదని అన్నారు ఏపీలో నిధులు వరద కురిపించి తెలంగాణకు బురద కొట్టారని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు అని అన్నారు.
Advertisement
Also read:
Also read:
IIM సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ 20 కేంద్రా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఆ మాట లేదని మండిపడ్డారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇవ్వడం మీద మాకేం బాధ లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటుగా నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా స్పందించలేదని అన్నారు. కేటీఆర్ సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన వారు బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఏపీ బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడడం బాధాకరమని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!