Advertisement
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD భారీ కలెక్షన్లను వసూలు చేసింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలిం జూన్ 27న విడుదలైంది. భారీ వసూళ్లతో వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. కల్కి 2898 AD అనే టైటిల్ వచ్చినప్పటి నుండి మొదట ఈ సినిమాలో కల్కి పాత్రలో ప్రభాస్ కనపడబోతున్నారు అని అంత భావించారు. ఇందులో ప్రభాస్ భైరవగా కనపడ్డారు. మహాభారతంలోని ఒక కీలక పాత్రలోని సర్ప్రైజ్ చేసారు.
Advertisement
కానీ కల్కి ఎవరు అనేది ఇంకా రివిల్ చేయలేదు. కల్కి యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు రాబోతున్నాయి. సెకండ్ పార్ట్ ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్లో కల్కి 2 విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కల్కి ఎవరు అనేది మాత్రం ఇంకా రివిల్ కాలేదు. కాబట్టి పార్ట్ 2 లో రివిల్ చేసే అవకాశం ఉంది. ఈ యూనివర్స్ లో కల్తీగా జూనియర్ ఎన్టీఆర్ కనువిందు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Advertisement
Also read:
ఎన్టీఆర్ తో పాటుగా పలువురు స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో కనపడబోతున్నారట. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో డౌట్ లేదు. మొదటి భాగమే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. రెండవ పార్ట్ లో స్టార్ హీరోలు కూడా జత కడితే ఇక బాహుబలి టు రికార్డులను బ్రేక్ చేయడం కచ్చితం అని అంతా ఫీల్ అవుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని దానిలో నిజం ఎంతో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!