Advertisement
అనంత్ అంబానీ పెళ్లి గురించి మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకునే విధంగా జరిపించారు. అనంత్, రాధికా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది ప్రముఖులు వీళ్ళ పెళ్లికి హాజరయ్యారు. ప్రపంచంలోనే వివాహం అత్యంత ఖరీదైన వివాహంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాధికా మర్చంట్ కి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే నెట్టుంట వైరల్ అవుతున్నాయి. అయితే ముఖేష్ అంబానీ పెద్ద కోడలైన శ్లోక అంబానీ గురించి చాలామందికి తెలీదు. కానీ చాలా మంది ఆమె గురించైనా ఆరా తీస్తున్నారు. అయితే శ్లోక కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం.
Advertisement
ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ భార్య శ్లోక 1990 జూలై 11న ప్రముఖ వజ్రాల వ్యాపారి అయినటువంటి రసల్ మెహతా ప్రముఖ జ్యువలరీ డిజైనర్ మోనా మెహతాలకి పుట్టారు. శ్లోక ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. హైస్కూల్లో ఉండగానే ఆకాష్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా క్లాస్మేట్స్. శ్లోకా కంటే ఆకాశంలో ఒక సంవత్సరం చిన్న. హై స్కూల్లో ఉన్నప్పుడే శ్లోకలో ఉండే సేవాగుణం ఆమె మాట్లాడే తీరు గమనించి ఆకాష్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారు. అయినా చాలాకాలం తన ప్రేమను మనసులోని దాచుకున్నారు ఆకాష్. 2009లో శ్లోకాకి ఆకాష్ చెప్పేశారు. ఆకాష్ గురించి శ్లోకాకి కూడా తెలియడంతో ఆమె కూడా ఒప్పుకున్నారు తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో శ్లోక పొలిటికల్ సైన్స్ లో లాలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
Advertisement
Also read:
కనెక్ట్ ఫర్ అనే ఒక ఎన్జీవో ద్వారా చాలామందికి ఎంతగానో సేవ చేస్తున్నారు ఇందులో ఏకంగా 70000 మంది వాలంటీర్లు ఉన్నారట. ఇప్పటివరకు ఎన్నో వేల మందికి సహాయం చేశారట. కానీ ఎప్పుడూ కూడా ప్రచారం చేసుకోలేదట. ప్రేమ గురించి ఇద్దరు ఇళ్లల్లో చెప్పేసారు. చదువుకున్నాక అప్పుడు ఈ విషయాన్ని బయటకు చెబుదామని పెద్దలు చెప్పడంతో ఇద్దరు కూడా ఉన్నత చదువులపై దృష్టి పెట్టారు. 2018 మార్చి 24న వీరి నిశ్చితార్థం జరిగింది 2019 మార్చి 9న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్లోక సంతోషంగా తన కుటుంబంతో ఉన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!