Advertisement
ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. యువకులు మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాల కోసం చూస్తూ ఉంటారు. నచ్చిన అమ్మాయికి రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. అవతలి వైపు నుండి అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంబంధం సెట్ అయిపోతుంది ఇలా మ్యాట్రిమోనీ ద్వారా కూడా చాలామంది సంబంధాలను వెతుక్కుంటున్నారు అయితే మ్యాట్రిమోనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఖాతా ఖాళీ అయిపోతుంది తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది. ఒక యువకుడు మ్యాట్రిమోనీలోకి వెళ్లి ఒక మహిళ చేతులు మోసపోయాడు. పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ఇదంతా బయటపడింది.
Advertisement
అందమైన అమ్మాయిల ఫోటోలను ఆ అబ్బాయికి పెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె మోసం చేసినట్లు తేలింది. మహిళని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు వైజాగ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న అబ్బాయి పెళ్లి సంబంధాల కోసం మాట్రిమోనీకి వెళ్ళాడు. అతను రిక్వెస్ట్ పెట్టడాన్ని గమనించిన ఓ మహిళ ఇన్స్టాలో అతన్ని పరిచయం చేసుకుంది వాట్సాప్ నెంబర్ తీసుకుని అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి అది తనే అన్నట్లుగా నమ్మించింది . అది నిజమే అని భావించాడు.
Advertisement
Also read:
ఇద్దరి మధ్య చాట్ నడుస్తోంది. యువకుడు కూడా తనకు సంబంధించి వ్యక్తిగత విషయాలను ఆమెతో షేర్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని అతన్ని నమ్మించింది ఆ తర్వాత కట్టు కథలు చెప్పడం మొదలుపెట్టింది డబ్బులు అత్యవసరంగా కావాలని చెప్పింది. అతను కూడా నమ్మి డబ్బులు వేయడం మొదలుపెట్టాడు ఏకంగా 22 లక్షలు అకౌంట్లో వేయించుకుంది. తర్వాత అసలు ఏం జరిగిందో అర్థమైంది అబ్బాయికి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు వారు కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఆమె గురించి ఆరా తీస్తే హైదరాబాద్ లోనే మాదాపూర్ తాండాకి చెందిన సాయి ప్రియ గా గుర్తించారు ఆమెను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!