Advertisement
క్రికెట్ లీగ్ లో రిచెస్ట్ టోర్నీగా ఐపీఎల్ కి పేరు ఉంది. 2008లో మొదలైన ఈ టోర్నీ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాదికి డిమాండ్ పెరుగుతూనే వస్తోంది తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. 2019లో మన దేశంలో ఎన్నికల జరిగినప్పుడు దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా లేదా అని ఐపీఎల్ మ్యాజిక్ క్రీడాకారులు సందేహం వ్యక్తం చేసారు. కానీ ఐపీఎల్ విజయవంతంగా సాగింది. ఐపీఎల్ రిచెస్ట్ టోర్నీగా ఆవిర్భవించింది. 2008 నుండి 2024 ప్రకారం బీసీసీఐ ఐపీఎల్ ద్వారా వేల కోట్లను వెనకేసుకుందని సమాచారం.
Advertisement
ఆవిర్భావం నుంచి 2008 వరకు వచ్చిన డబ్బు కంటే అది ఎక్కువ అని తెలుస్తోంది. 2008 నుంచి 2024 దాకా సక్సెస్ ఫుల్ గా ఐపిఎల్ సీజన్లు నిర్వహించిన బీసీసీఐ తదుపరి సీజన్ కోసం సిద్ధమవుతోంది. 2024 లో జరిగే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఐపీఎల్ లో ఒక్కో ఫ్రాంచైజ్ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
Advertisement
Also read:
Also read:
నలుగురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉంటారని ఈ స్థాయిలో ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్ని జట్లు బీసీసీఐ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 31న బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి సమావేశాన్ని జరపబోతోంది. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజ్ లు పాల్గొంటాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!