Advertisement
ఏపీలో అరాచక పాలన సాగుతోంది. ఢిల్లీ స్థాయిలో గొంతెత్తి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పురోగతి రివర్స్ లో నడుస్తోందని అన్నారు. గత 52 రోజులుగా దాడులు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసం కొనసాగుతున్నట్లు ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణిలో చంద్రబాబు పాలన ఉందని ఫైర్ అయ్యారు. విధ్వంసపాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఏపీ బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు సర్కార్ ఉందని 7 నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోందని అన్నారు.
Advertisement
పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టె ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదని పాలన ఎంతటి అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలు కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగో లేకపోయినా బాగోలేకనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని వైయస్ జగన్ విమర్శించారు.
Advertisement
Also read:
శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ విధంగా ఈ ఏడాది జూన్ దాకా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జగన్ వివరించారు. చంద్రబాబు కంటే తమ హయాంలోని తక్కువ అప్పులు చేశామని అన్నారు. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు నాలుగు లక్షల 85 కోట్లు. రిపోర్ట్ లో పది లక్షల కోట్లు అని ఇంకో రిపోర్ట్ లో 14 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!