Advertisement
ఎడారి దేశాల్లో ఇండియన్స్ చిక్కుకుపోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కొద్దిరోజుల క్రితం కువైట్లో చిక్కుకున్న శివ అనే యువకుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. కటిక ఎడారిలో జంతువులు మధ్య పడుతున్న బాధను అతను పోస్ట్ చేసాడు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమకు చెందిన వీరేంద్ర సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు. అదే మాదిరిగా ఆయనను సైతం కాపాడి స్వస్థలానికి రప్పించే ప్రయత్నాలు చేసారు. అక్కడ ఒంటలు ఉన్న ఎడారిలో ఆయనను పడేసారు వాటి సంరక్షణ బాధ్యతల్ని అప్పగించారు.
Advertisement
అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక భోజనం, వసతి సరిగ్గా లేక వీరేంద్ర రక్తపు వంతులు చేసుకున్నాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి కాపాడాలని వేడుకున్నాడు. తను పడిన బాధల్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో పై మంత్రి లోకేష్ స్పందించి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న బాధితుల జీవితం ఆడు జీవితం సినిమాకు దగ్గరగా ఉంది.
Advertisement
Also read:
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఆ మధ్య వచ్చిన సినిమాలో మలయాళ యువకుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకి వెళ్తాడు. అక్కడ కష్టాలు పడుతూ ఉంటాడు. చివరికి ప్రభుత్వం చొరవ చూపి స్వస్థలానికి రప్పిస్తుంది. ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. అక్కడి నుండి తప్పించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎడారి దేశాల్లో భారతీయులు దుర్భర జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్లు ఆ సినిమాలో చూపించారు. ఉపాధి కోసం దేశాలు దాటిన భారతీయ యువత నిర్బంధ కూలీగా మారుతున్నారు. అమానుష చర్యలకు బాధితులుగా మిగిలిపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!