Advertisement
యోజన గరత్ గురించి చూస్తే ఖచ్చితంగా శభాష్ అంటారు. ఈమె స్మిత్ ఓల్డ్ ఏజ్ హోమ్ అలాగే కేర్ ఫౌండేషన్ ముంబైలో నడిపిస్తున్నారు. 3500 మంది పెద్దవాళ్ళను చేరదీసి వారికి ఆహారం వసతి ఆరోగ్య సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నారు. ఈమె చేస్తున్న ఈ పనికి ఎంత మెచ్చుకున్న తక్కువే. యోజన గరత్ ఒక అనాధాశ్రమంలో పెరిగారు. ఎప్పుడూ కూడా తల్లి తండ్రి ఎలా ఉంటారని ఊహించుకోవడమే తప్ప వాళ్ళను చూసింది లేదు. ఇప్పుడు ఆమె ఏకంగా 126 మందికి తల్లిగా మారారు. ఇప్పుడు ఆమెకి ఏకంగా 126 మంది తల్లిదండ్రులు ఉన్నారు.
Advertisement
గుడి దగ్గర, రైల్వే స్టేషన్లో, బ్రిడ్జిలు కింద ఆసుపత్రి ఆవరణలో ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళను ఆమె చేరదీసారు. ఇలా వాళ్లకు ఆమె కూతురుగా మారారు. స్మిత్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ ఎంతో మందికి ఆశ్రయం కల్పించింది. వాళ్ల కోసం మెడికల్ ట్రీట్మెంట్ ని కూడా అందిస్తున్నారు. ప్రేమగా, ఆప్యాయతగా వాళ్లకు ఆహారాన్ని అందిస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. ఆమె తల్లి తండ్రి లాగ వాళ్లను ట్రీట్ చేస్తారు. వాళ్లకి ఆహారం తినిపించడం కొంతమందికి డైపర్లు మార్చడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎవరూ లేక బాధపడే వాళ్లకు ఆశ్రయం కల్పించి వాళ్ళ ముఖంలో చిరునవ్వుని తీసుకువచ్చారు. ఆమె ఈ ఆశ్రయము ద్వారా ఎంతోమంది తల్లిదండ్రులని పొందారు. ఆమె కూడా ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!