Advertisement
శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తింది. గంట గంటకు కూడా వరద ఉధృతితో శ్రీశైలం డ్యామ్ నిండిపోతోంది. శ్రీశైలం జలాశయం గేట్లను రేపు ఎత్తాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో నాలుగు లక్షల అరవై నాలుగు వేల 952 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లోర్ 62847 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 887 అడుగులు. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది. కుడిగట్టు ఎడమ గట్టుల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Advertisement
వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధపడ్డారు. రేపు జనవరి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.
Advertisement
Also read:
Also read:
జలాశయం రేడియల్ క్రష్ గేట్లు ఎత్తు దిగువున ఉన్న నాగార్జునసాగర్ కి నీటిని విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10 లేదా 11 గంటల సమయంలో క్రషర్ గేట్లు ఎత్తి నీటి దిగువకు తరలించే అవకాశం ఉంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వలన శ్రీశైలం డ్యామ్ క్రషర్ గేట్లు ఎత్తలేదు. దాదాపు 15, 20 రోజులు ముందే క్రషర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!