Advertisement
టైం వస్తే ఎవరిని ఊరుకోమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎవరు తప్పు చేసినట్లు రుజువైనా కూడా ఊరుకోమని అన్నారు. కచ్చితంగా జైలుకు పంపిస్తామని అన్నారు. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అయినా జగన్ అయినా ఎవరు తప్పు చేశారని తేలినా ఊరుకోమని తేల్చి చెప్పేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని దీని వెనక ఎవరున్నారు అనేదాని గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని అన్నారు. ఇప్పటికే సీనియర్ అధికారి సిసోడియా అక్కడ మూడు రోజుల పాటు మఖం వేసి విచారణ చేస్తున్నారని ఆయన చెప్పారు.
Advertisement
Also read:
Advertisement
ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా శిక్షించి తీరుతామని పరోక్షంగా అయినా జగన్ పై కామెంట్స్ చేశారు. టైం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందని అన్నారు. వీటి గురించి విచారణ చేయిస్తామని అన్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కోసం వేల రూపాయలు లీజులు ఇవ్వడని ఆయన తప్పు పట్టారు. ఇటువంటివి ఎలా జరుగుతాయో తేలుస్తామని అన్నారు. వీటి పైన విచారణ చేయాల్సి ఉందని అన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన అనగాని గత ప్రభుత్వాన్ని 22 ఏ అసైన్డ్ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడానికి నిబంధనలు ఎత్తివేసింది అని విమర్శించారు. సరిహద్దు రాళ్ల కోసం వాటిపై జగన్ ఫోటోలు వేసుకోవడం ఎందుకు..? 350 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!