Advertisement
శ్రావణ మాసంలో కొన్ని పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణమాసంలో పార్వతి దేవి తపస్సు చేయడం వలన శివుడిని భర్తగా పొందింది. అటువంటి పవిత్రమైన మాసంలో ఉద్యోగం కుటుంబం పైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి ఇలా చేయడం మంచిది. దీంతో చక్కగా సంతోషంగా ఉండవచ్చు. 108 బిల్వపత్రాలతో శివుని పూజిస్తే చాలా మంచిది శివునికి ఒక్కొక్క బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం సాంబ సదాశివాయ నమః అని జపించండి దీంతో కోరికలు నెరవేరుతాయి. విజయాన్ని అందుకోవచ్చు. అలాగే పురాణాల ప్రకారం శ్రావణమాసంలో క్షీరసాగర మధనం జరిగిందని అంటారు. ఆ సమయంలో నుండి 14 రకాల మూలకాలు రత్నాలను దేవతలు రాక్షసులు వాటిని తమలో తాము పంచుకున్నారు.
Advertisement
ఆ మూలకాలలో హాలాహళ్ విషం కూడా ఒకటి. ఆ విషాన్ని శంకరునికి అందించబడుతుంది శంకరుడు విషాన్ని కంఠంలో ధరించాడు. దీని కారణంగా శంకరుని కంఠం నీలంగా ఉంటుంది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడికి జలాభిషేకం చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. పాలతో అభిషేకం చేయడం వలన ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన శరీరాకృతి ఉంటుంది.
Advertisement
Also read:
Also read:
చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సువాసన ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ప్రసిద్ధి చెందుతారు. చక్కెరతో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది. మామిడి రసంతో అభిషేకం చేస్తే సంతానయోగం కలుగుతుంది. గంగాజలంతో అభిషేకం చేస్తే ముక్తి కలుగుతుంది. నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం. తైలం అభిషేకం చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. శ్రావణమాసంలో శివుడికి ఆవాల నూనెతో అభిషేకం చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!