Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేవుడులా భావించి హీరోతో ఫోటో దిగడానికి కానీ మాట్లాడ్డానికి కానీ ఫాన్స్ వెనక పడుతూ ఉంటారు. వాళ్ళని తోసిన ఘటనలు చాలా చూసాం. ఇంకా చూస్తున్నాం కూడా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇలానే ప్రవర్తించి చెడ్డ పేరుని తెచ్చుకున్నారు. అభిమానిని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ తోయడం అస్సలు బాలేదని కామెంట్స్ వినపడుతున్నాయి. రీసెంట్ గా చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన చిరు తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టగానే ఇండిగో సిబ్బంది చిరుతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు.
Advertisement
Advertisement
చిరు వారిని ఎవరిని చూడకుండా కారు వద్దకు నడుస్తుండగా ఒక ఇండిగో సిబ్బందికి చెందిన వ్యక్తి చిరంజీవితో సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేశారు. దీంతో అతన్ని మర్యాద లేకుండా పక్కకి తోసి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజెన్స్ కూడా మండిపడుతున్నారు. అతను నీ ఆస్తి అడిగాడా నీతో సెల్ఫీ కదా అడిగాడు. మరీ ఇంత బలుపు ఉండకూడదు అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.
Also read:
ఇంకోపక్క ఇండిగో సిబ్బందిని కూడా మెగా ఫాన్స్ తప్పుపడుతున్నారు. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు. సెల్ఫీలు ఇస్తూ ఉంటే వాళ్లకు ఓపిక ఉండద్దా..? వేరే పనుల్లో బిజీగా ఉన్నారేమో ఆలోచించకుండా ఎగబడడం మంచి పద్ధతి కాదని ఫ్యాన్స్ అంటున్నారు. కొంతమంది అలా తోయకుండా నోటితో చెప్పి ఉండొచ్చు కదా అని వాదిస్తున్నారు. కొంతమంది చిరంజీవిని ఘోరంగా బూతులు తిడుతున్నారు. తిడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!